పాయల్ రాజ్ పుత్ 5Ws ఫస్ట్ లుక్

0
14

ఐపీఎస్‌ అధికారిగా పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి 5Ws – Who, What, When, Where, Why అని టైటిల్‌ ఖరారు చేశారు. సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు అనేది ఉప శీర్షిక. ప్రణదీప్‌ ఠాకోర్‌ దర్శకునిగా పరిచయం అవుతు న్నారు. యశోద ఠాకోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఫిల్మ్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ “ఇన్నాళ్లు ఈ సినిమా గురించి మౌనంగా ఉన్నాను. అని టైటిల్‌ పెట్టారు. నాకు నా కెరియర్‌కి కంప్లీట్‌గా కొత్త సినిమా. పోలీస్‌ పాత్ర చేయాలని ప్రతి ఆర్టిస్టు కలలు కంటారు. ఆ ఛాన్స్‌ నాకు వచ్చింది. ఈ పాత్ర చేయడానికి విజయశాంతి గారు స్ఫూరి”్త అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ “ఇదొక క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ మిస్టరీ డ్రామా. ఐదు ప్రశ్నలతో పోలీసులు పరిశోధన ప్రారంభిస్తారు. ఒక పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను” అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ “ఒక రకంగా నేను స్త్రీవాదిని. నా భర్త తీస్తున్న సినిమా మహిళల గురించి, స్త్రీ శక్తి గురించి అవడం నాకు గర్వంగా ఉంది” అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత శివకుమార్‌, సిని మాటోగ్రాఫర్‌ అనిల్‌ బండారి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here