పవన్ వకీల్ సాబ్ టైటిల్ లోగోలో ఉన్న పెద్ద మిస్టేక్ ఏమిటో గమనించారా?

0
21

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్స్ లో బిజీగా పాల్గొంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కి కూడా ఆయన హాజరవుతున్నారు. ఈ రెండు చిత్రాలు ఏక కాలంలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. వకీల్ సాబ్ వేసవి కానుకగా మే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ మగువా మగువా..ఉమెన్స్ డే కానుకగా మార్చ్ 8న విడుదల కానుంది.

కాగా పవన్ మూవీ టైటిల్ లోగో లో ఓ ఆసక్తికర విషయం దాగివుంది. వకీల్ సాబ్ టైటిల్ లోగోలో పవన్ జాకెట్ లో చేతులు పెట్టుకొని స్టయిల్ గా నడిచొస్తున్న ఆర్ట్ ఫార్మ్ ఉంది. నిజానికి అది పవన్ కళ్యాణ్ లీక్డ్ పిక్. వకీల్ సాబ్ మొదటి రోజు షూట్ జరుగుతున్నప్పుడు పవన్ ఫోటోలు ఎవరో తీయడం, అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. అప్పుడు ఇలా సెట్స్ నుండి ఫోటోలు లీక్ కావడంపై పవన్ కళ్యాణ్ కూడా కొంచెం అసహనానికి గురయ్యారు. ఆశ్చర్యంగా అదే లీక్డ్ పిక్ ఆర్ట్ ని అధికారిక టైటిల్ లోగోలో వాడడం అనేది అరుదైన విషయం అని చెప్పాలి. లీకైన పిక్స్ ని కొందరు ఫ్యాన్స్ అలా ఆర్ట్ ఫార్మ్ లోకి మార్చి ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకోగా, దానిని అధికారిక టైటిల్ లోగో కోసం వాడేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here