పవన్ కళ్యాణ్ రాజకీయ ఇమేజ్ కి అగ్నిపరీక్ష పెట్టబోతున్న బ్రహ్మానందం !

0
2

ప్రస్థుతం సినిమాలలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన బ్రహ్మానందం భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. డిసెంబర్ మొదటి వారంలో జరగబోతున్న కర్ణాటక రాష్ట్రంలోని ఉప ఎన్నికలు అక్కడి భారతీయ జనతా పార్టీ మనుగడకు అత్యంత కీలకంగా మారాయి.

ఈ ఉప ఎన్నికలలో గెలిచి తీరాలి అన్న పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో తెలుగువారు ఎక్కువగా ఉండే అసెంబ్లీ స్థానాలలో బ్రహ్మానందం చేత ప్రచారం చేయించే ఎత్తుగడ వేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలో ఉండే తెలుగు మాట్లాడే వారికి బ్రహ్మీ పేరు తెలియని వారుండరు.

దీనితో బారతీయ జనతా పార్టీని గెలిపించండి అంటూ బ్రహ్మీ కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపుర పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో బ్రహ్మీ సుడిగాలి పర్యటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో 2018 ఎన్నికలలో ఇదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కొందరు అభ్యర్ధుల విజయం కోసం ప్రత్యేకమైన విమానంలో వెళ్ళి కొందరు ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ప్రచారం చేసాడు.

అయితే పవన్ ఎంత ప్రచారం చేసినా ఆ అభ్యర్ధులు గెలవలేదు. దీనితో ఇప్పుడు బ్రహ్మానందం మాటలువిని అక్కడి తెలుగు ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారా లేదా అన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలు వస్తే కాని తెలియదు. ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు బ్రహ్మీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో బ్రహ్మానందం తెలుగు రాష్ట్రాలలో కూడ బిజెపి కోసం ప్రచారం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోకి కూడ ఎన్నికలలో తిరస్కరణ వచ్చిన నేపధ్యంలో కేవలం ఒక టాప్ కమెడియన్ క్రేజ్ తప్ప మరే విధమైన ప్రత్యేకత లేని బ్రహ్మానందం చేస్తున్న ఈ సాహసం వెనుక ఎదో ఒక కారణం ఉంది అని అంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here