పలాస డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ

0
18
Image result for vijay devarakonda latest images
రీసెంట్ గా పలాస సినిమాతో ప్రతిభ చాటిన డైరెక్టర్ కరుణ కుమార్ ఆ సినిమా రిలీజ్ ముందే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బ్యానర్ లో ఛాన్స్ అందుకున్నాడు. అల్లు అరవింద్ నుండి అడ్వాన్స్ కూడా అందుకున్న ఈ డైరక్టర్ ఒక కథ సిద్ధం చేశాడట. విజయ్ దేవరకొండ హీరోగా కరుణ కుమార్ రెండో సినిమా ఉంటుందని తెలుస్తుంది. కరుణ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో విజయ్ కూడా చిన్న చిన్న మార్పులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. విజయ్ తో గీతా ఆర్ట్స్ గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు నిర్మించింది. ఇక హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా వస్తుంది. పలాసతో మెప్పించిన కరుణ కుమార్ విజయ్ దేవరకొండ లాంటి ఎనర్జిటిక్ హీరోతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here