పరుశరామ్ తో మహేష్ మూవీ స్టోరీ ఇదేనా?

0
20

టాలీవుడ్ లో భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటూ దూకుడు మీద ఉన్న మహేష్ బాబు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే మహర్షి లాంటి సూపర్ హిట్ తనకు అందించిన వంశిపైడిపల్లి తో మరో మూవీ ఉంటుందని భావించినప్పటికీ ఆయన తీసుకు వచ్చిన స్క్రిప్ట్ అంత బలంగా లేదని.. కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకురావాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. దాంతో ఆయన మరో స్టోరీకి ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. అయితే వరుస విజయల జోష్ లో ఉన్న మహేష్ బాబు ‘గీతా గోవిందం’ లాంటి సూపర్ హిట్ అందుకున్న పరుశరామ్ ని లైన్లో పెట్టారు.

పరశురామ్ ప్రస్తుతం నాగ చైతన్యతో నాగేశ్వరరావు సినిమాను చేసే పనిలో ఉన్నాడు. అయినా కూడా మహేష్ బాబు నుండి వచ్చిన పిలుపుని ఆయన కన్సిడర్ చేసి నాగేశ్వరరావును పక్కకు పెట్టే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ ఆయన నాగ చైతన్యతోనే కమిట్ అవుతున్నట్లు సమాచారం. ఈ మూవీ పూర్తయిన తర్వాత మహేష్ బాబు తో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. పరుశరామ్.. మహేష్ బాబు తో తీసే మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ మద్య భారత దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై.. వాటిని మోసం చేసి దర్జాలు వెలగబెడుతున్న కొంత మంది బడాబాబుల ఆట కట్టించే విషయంపై కథ కొనసాగుతుందట. విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్య మరియు నీరవ్ మోడీల పాత్రలను ఈ చిత్రంలో చూపించబోతున్నారట. అలాంటి మోసాల నుండి దేశాన్ని.. దేశ ఆర్థిక వ్యవస్థను హీరో ఎలా కాపాడాడు అనేది కథగా పరశురామ్ మహేష్ బాబు. మరోవైపు పరుశరామ్ తో ఇప్పట్లో మూవీలేదని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here