పప్పు లాంటి అబ్బాయి వీడియో సాంగ్ విడుద‌ల చేసిన వ‌ర్మ‌

0
2

వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తుండ‌గా, చిత్రానికి సంబంధించి రోజుకొక అప్‌డేట్ ఇస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల కేఏపాల్‌కి సంబంధించిన స్పెష‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేయ‌గా, తాజాగా ఆయ‌న మ‌రో పాట‌ని విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ పార్ట్‌లో తండ్రి ప‌డే బాధ‌, సెకండ్ పార్ట్‌లో కొడుకు ప‌డుతున్న బాధ‌ల‌ని చూపించారు. అంతేకాదు పాటలో సైకిల్ గురించి, తాతనుండి సైకిల్ లాగేసున్న విధానం గురించి, పార్టీకి భాద్యత వహించాల్సిన వ్యక్తుల గురించి చ‌ర్చిస్తూ విజువల్స్‌తో ఆసక్తిగా చూపించారు. పప్పులాంటి అబ్బాయి పాత్ర ఏపీలోని ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత కుమారుడిని ఉద్దేశించినట్లు కనిపిస్తోందని చ‌ర్చించుకుంటున్నారు. మీరు ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here