నేను ఆ రకం కాదు

0
49
Anupama Parameswaran on Tradition And Culture - Sakshi

సినిమా : తాను ఆ రకం కాదు అని అంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌. ప్రేమమ్‌ అనే మలమాళ చిత్రం ద్వారా విరబూసిన పూబోణిల్లో ఈ భామ ఒకరు. ఆ తరువాత తమిళంలో కొడి అనే ఒకే ఒక చిత్రంలో నటించి కనుమరుగైన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం బాగానే నటించేసి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ అవకాశాలు అడుగంటాయి. ప్రస్తుతం మాతృభాషలో ఒక చిత్రం, చాలాకాలం తరువాత కోలీవుడ్‌లో ఒక చిత్రం చేస్తోంది. అనుపమ ఇప్పుడు తరచూ సామాజక మాధ్యమాల్లో కనిపించడానికి తాపత్రయ పడుతోంది. అలా ఒక భేటీలో మాట్లాడుతూ సంప్రదాయ, అలవాట్లు, ఆచార వ్యవహారాల గురించి పెద్ద లెక్చరే ఇచ్చింది. ఈ తరం, భావితరం కంటే నాటి తరం సంప్రదాయమే మేలని ఒక ఉచిత సలహాను కూడా ఇచ్చేసింది. ఇంతకీ అనుపమ పరమేశ్వరన్‌ ఏం చేప్పిందో చూద్దామా! ఈ తరం యువత జీవన సరళి విభిన్నంగా ఉంది. ఫ్యాషన్‌ ప్రపంచంలో జీవిస్తున్నాం.

పాత తరం జీవన విధానం గురించి అస్సలు అలోచించడానికే సమయం సరిపోవడం లేదు. మన ముందు తరాల ఆచార వ్యవహారాలను ఆచరించడానికి ఇష్ట పడడం లేదు. నేను ఆ రకం కాదు. పాత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను నమ్ముతాను. పెద్దల మాటలకు గౌరవం ఇస్తాను. ప్రజలు ఇలానే జీవించాలని పెద్దలు కొన్ని పద్ధతులను నియమించారు. ఒక్కో పద్ధతి వెనుక ఒక కారణం ఉంటుంది. దాన్ని నాగరీకం పేరుతో ఈ తరం విస్మరించడం సరైన విధానం కాదు. నవ తరం ఆధునిక పోకడలతో సంప్రదాయబద్ధమైన విషయాలను పక్కన పెట్టడం కరెక్ట్‌ కాదు. నేను నటి అయిన తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. సినిమారంగంలోకి రాక ముందు ఎలా ఉండేదాన్నో, ఇప్పుడూ ఇంట్లో అలానే ఉంటున్నాను. నేను రాహు కాలం, అష్టమి, నవమి, మంచి గడియలు వంటి వాటిని నమ్ముతాను. వాటి గురించి పెద్దలు ఊరికే చెప్పలేదు. వాటిని ఆచరిస్తే సంప్రదాయబద్ధమైన జీవినాన్ని సాగించవచ్చు. నమ్మకాలతోనే జీవితం సాగుతోంది అని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పుకొచ్చింది. కాగా సడన్‌గా ఈ అమ్మడు పాత తరం, సంప్రదాయం వంటివి వల్లించడంలో అర్థమేమిన్న ప్రశ్న సినీ జనాల్లో రెకెత్తుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here