నా స్వయంవరంలో ప్రభాస్‌ఉండాలి: తమన్నా

0
21

ముంబయి: ముద్దుగుమ్మ తమన్నా పెళ్లి కబురు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని మిల్కీబ్యూటీ తల్లి ఇటీవల చెప్పారు. ఈ క్రమంలో ఆమె పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి. కానీ వాటిని తమన్నా ఖండించారు. కాగా ఈ భామ తాజాగా తన పెళ్లి గురించి ముచ్చటించారు. ‘మీకే స్వయం వరం పెడితే.. ఏ నటులు రావాలని కోరుకుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తమన్నా జవాబిచ్చారు. స్వయం వరం కోసం ముగ్గురు నటుల్ని ఎంచుకోమని అడగగా.. ‘ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, విక్కీ కౌశల్‌’ అని టక్కున సమాధానం చెప్పారు.

అంతేకాదు తమన్నా ఇంత వరకు ఏ సినిమాలోనూ ముద్దు సన్నివేశాల్లో నిజంగా నటించలేదు. ఆమెతో అలాంటి సన్నివేశాలు తీయాలంటే కెమెరా ట్రిక్కులు వాడాల్సిందే. సినిమాకు సంతకం చేయడానికి ముందే తమన్నా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అయితే హృతిక్‌ కోసమైతే తన నో-కిస్‌ ఒప్పందాన్ని పక్కనపెడతానని ఈ భామ చెప్పారు. ‘సాధారణంగా నేను స్క్రీన్‌పై కిస్‌ చేయను. నా ఒప్పందాల్లో అది ఒకటి. కానీ హృతిక్‌ రోషన్‌తో అయితే చేస్తానని నా స్నేహితులతో జోక్‌లు వేస్తుంటా’ అని ఆమె చెప్పారు. మరి తమన్నా మాటలకు హృతిక్‌, విక్కీ కౌశల్‌, ప్రభాస్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here