నా వివాహ వేడుక వ్యక్తిగతం

0
45

Image result for anushka latest images

ఎవరి కైనా పెళ్లి అంటే వ్యక్తిగతమే కానీ.. సినిమాల్లో నటించే నటీనటుల పెళ్లిళ్లు పబ్లిక్. ఎందుకంటే వాళ్ళ పెళ్లి విషయం వాళ్లకన్నా ముందే మీడియాకి పాకేస్తుంది. అంతలా సెలబ్రిటీస్ మీద మీడియా దృష్టి పెడుతుంది. ఇక అనుష్క పెళ్లి విషయం మాత్రం మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్కే.

అయితే తాజాగా నిశ్శబ్దం ఇంటర్వ్యూ లలో బిజీగా ఉన్న అనుష్క తన పెళ్లి ముచ్చట్లను మాట్లాడింది. తనకి పెళ్లిపై.. నమ్మకం ఉందని. తన మీద వస్తున్న పెళ్లి పుకార్లలో ఎలాంటి నిజాలు లేవని. అలాంటి పుకార్లు వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినా ఎలాంటి బాధ ఉండదని.. కాకపోతే పెళ్లి అనేది వ్యక్తిగతం అని అసలు తన పెళ్లిగురించే ఇంతిలా ఎందుకు మాట్లాడుకుంటారో అర్ధం కావడం లేదని. ఇతరులు తన వ్యక్తిగత జీవితములోకి చొరబడితే అది తనకి నచ్చదని.. మీడియా వాళ్ళకి సున్నితంగానే ఓ వార్నింగ్ లాంటిది ఇచ్చేసింది. పెళ్లి అనేది పవిత్ర బంధం అని తాను నమ్ముతా అని.. పెళ్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. పెళ్లి తర్వాత ఏం అడిగిన తాను సమాధానం ఇవ్వడానికి సిద్దముగా ఉంటానని చెబుతుంది అనుష్క.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here