నాగ్‌అశ్విన్ నిర్మాణంలో జాతిరత్నాలు

0
3

అలనాటి మేటి నటి సావిత్రి జీవితాన్ని మహానటి చిత్రంలో అద్వితీయ రీతిలో ఆవిష్కరించి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు నాగ్‌అశ్విన్. తాజాగా ఆయన నిర్మాతగా మారి స్వప్న సినిమా పతాకంపై రూపొందిస్తున్న చిత్రం జాతిరత్నాలు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఖైదీలుగా కనిపిస్తున్నారు. వారి దుస్తులపై 210, 420, 840 నంబర్స్ ఉండటం ఆసక్తిని పంచుతుంది. సత్ప్రవర్తన వల్ల త్వరగా బయటికొస్తున్న మా వాళ్లు మీ జాతిరత్నాలు అంటూ చిత్రబృందం పేర్కొన్నది. పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. 75 శాతం చిత్రీకరణ పూర్తయింది అని దర్శకుడు పేర్కొన్నారు. ఫరియాఅబ్దుల్లా, మురళీశర్మ, వి.కె.నరేష్, బ్రహ్మాజీ, శుభలేఖసుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రధన్, సినిమాటోగ్రఫీ: సిద్ధాన్ మనోహర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here