నాగార్జున ఈ రోజు మ‌న బిడ్డ 30వ బ‌ర్త్‌డే: వ‌ర్మ‌

0
1

నాగార్జున ఈ రోజు మ‌న బిడ్డ 30వ బ‌ర్త్‌డే: వ‌ర్మ‌

28 ఏళ్ళ క్రితం శివ సినిమాతో కొత్త ఒర‌వ‌డి సృష్టించిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. శివ సినిమాకి ముందు శివ సినిమా త‌ర్వాత అని చెప్పుకునేలా ఆ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. నాగార్జున‌, అమల ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ క్లాసిక్ చిత్రాన్ని ఇప్ప‌టి ద‌ర్శ‌కులు కూడా ఆద‌ర్శంగా తీసుకుంటార‌నేది వాస్త‌వం. అప్ప‌ట్లో ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగ‌డం అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. విమ‌ర్శ‌కులు సైతం ఈ సినిమాని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోయారు. అక్టోబ‌ర్ 5,1989న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 30 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ శివ సినిమా పోస్ట‌ర్‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చూస్తూ.. నాగార్జున ఈ రోజు మ‌న ప్రియ‌మైన బిడ్డ 30వ బ‌ర్త్‌డే అని కామెంట్ పెట్టాడు. శివ సినిమా త‌ర్వాత నాగార్జున‌- వ‌ర్మ 1992లో వ‌చ్చిన అంతం సినిమా కోసం క‌లిసి ప‌ని చేశారు. ఇక 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆఫీస‌ర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here