ధనుష్, కార్తిక్‌ సుబ్బరాజ్‌ చిత్రం పూర్తి

0
3

కోడంబాక్కం: రజనీకాంత్‌ హీరోగా ‘పేట’ చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబరులో లండన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాగా 64 రోజుల్లోనే పూర్తి చేశారు. వై నాట్‌ స్టూడియోస్‌ బ్యానరుపై శశికాంత్‌ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదు. ‘పేట’ మాదిరిగానే ఈ చిత్రం భిన్నంగా ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడిగా ఈ సినిమాను పూర్తిచేసిన కార్తిక్‌ సుబ్బరాజ్‌ నిర్మాతగా కూడా మరో సినిమాను పూర్తిచేశారు. అదే ‘పెంగ్విన్‌’. కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబరులో మొదలుపెట్టి తాజాగా పూర్తి చేశారు. మొత్తానికి దర్శకుడిగా, నిర్మాతగా రెండు సినిమాలను పూర్తిచేసి నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్నారు కార్తిక్‌ సుబ్బరాజ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here