‘దొంగ’ వచ్చేస్తున్నాడు…

0
2

కోలీవుడ్, టాలీవుడ్ లో తనదైన విభిన్నమైన నటనతో మంచి క్రేజ్ సంపాదించాడు నటుడు కార్తీ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు అయిన కార్తీ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ ఇమేజ్ వాడుకోకుండా తనదైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికు వరకు తమిళంలో ఏ సినిమాలో నటించిన ఆ మూవీ తెలుగు లో తప్పకుండా డబ్ చేయిస్తున్నారు కార్తీ. రీసెంట్ గా కార్తీ నటించిన ‘ఖైదీ’ సూపర్ హిట్ అయ్యింది. వందకోట్ల క్లబ్ లో కూడా చేరింది.

అయితే ఈ మూవీ తమిళ్ లోనే కాదు తెలుగు లో కూడా మంచి విజయం సాధించి బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ మద్య ఖాకీ మూవీ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకొని లాభాలు తెచ్చిపెట్టింది. కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడం..ఆయన సోదరుడు సూర్య సైతం తెలుగులో మంచి మూవీస్ తీసుకురావడం వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ములకు టాలీవుడ్ లో బాగా కలిసి వస్తుంది. తాజాగా కార్తీ, జ్యోతిక ముఖ్యపాత్రలో ‘దొంగ’ మూవీ వస్తుంది. ‘ఖైదీ’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది.

సినిమా మొత్తం ఒకే ఒక డ్రెస్ లో కనిపించిన కార్తీకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. ఇక ‘దొంగ’ లో డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపిస్తున్నాడు. ‘జ్యోతిక’ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రీల్ లైఫ్ లో కార్తీకి జ్యోతిక వదిన అవుతుంది. మొదటి సారిగా వీరిద్దరు ఒకే తెరపై కనిపించబోతున్నారు. ఇందులో జ్యోతిక అక్క పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here