దృశ్యకావ్యంలా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’’

0
16
30 Rojullo Preminchadam Ela Movie Sensar Over - Sakshi

బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకుల్ని అలరించిన ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. మున్నా దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్‌ కథానాయిక. ఎస్వీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్వీ బాబు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ఎస్వీ బాబు మాట్లాడుతూ– ‘‘లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రదీప్‌ రెండు షేడ్స్‌ ఉన్న పాత్రలో కొత్తగా కనిపిస్తారు.. ఆయన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. హీరో–హీరోయిన్ల మధ్య సన్నివేశాలు భావోద్వేగంతో ఉంటాయి. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ దృశ్యకావ్యంలా తెరకెక్కించారు. హీరో మహేశ్‌బాబు చేతుల మీదగా ఇటీవల విడుదలైన ‘నీలి నీలి ఆకాశం..’ పాట సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో ఇప్పటికే 50 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఒక చిన్న సినిమా పాట ఈ స్థాయిలో పాపులర్‌ కావడం ఈమధ్య కాలంలో మాదే. సంగీతప్రియులు ఈ స్థాయిలో పాటను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: దాశరథి శివేంద్ర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here