* థప్పడ్‌ మూవీపై విద్యాబాలన్‌ ప్రశంస ఎప్పటికీ గుర్తుంటుంది – నటుడు పావిల్‌ గులాటి

0
32

ముంబయి: విద్యాబాలన్‌ తనకిచ్చిన ప్రశంస ఎప్పటికీ గుర్తుంటుందని బాలీవుడ్‌ నటుడు పావిల్‌ గులాటి అన్నారు. తాప్సీ, పావిల్‌ గులాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థప్పడ్‌’. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలై మంచి ప్రశంసలను అందుకుంది. తాజాగా పావిల్‌ గులాటిని ఓ ఆంగ్ల పత్రిక వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయగా థప్పడ్‌ చిత్రానికిగానూ తాను అందుకున్న గొప్ప ప్రశంస గురించి ఆయన తెలిపారు.

”థప్పడ్‌’ సినిమా విడుదలైన సమయంలో ఒకరోజు ప్రముఖ నటి విద్యాబాలన్‌తో మాట్లాడాను. ఆమెతో మాట్లాడుతున్నంతసేపు నా ఒళ్లు గగుర్పొడిచింది . ఆమె నాకు ఒక్కటే చెప్పింది.. ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు. సినిమా చివర్ల్లో నిన్ను ఇష్టపడినందుకు నన్ను నేను అసహ్యించుకుంటున్నాను’ అని విద్యాబాలన్‌ చెప్పారు. ఆమె ఇచ్చిన ప్రశంసను నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.’ అని పావిల్‌ గులాటి తెలిపారు.

అనంతరం థప్పడ్‌ సినిమాలో తాను పోషించిన విక్రమ్‌ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘నేను పోషించి విక్రమ్‌ పాత్రలో విభిన్నమైన కోణాలుంటాయి. దర్శకుడు అనుభవ్‌ సిన్హా కూడా ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా విక్రమ్‌ను మంచిగా చూపించాలనుకున్నాడు. విక్రమ్‌ పాత్ర చూసి ప్రేక్షకులు అతన్ని ద్వేషించాలనుకున్నాం. అలాగే అతని మీద ప్రేక్షకులు సానుభూతి కూడా కురిపించాలని భావించాం’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here