తెనాలి రామకృష్ణ మూవీ రీలీజ్ డేట్ ఫిక్స్

0
4

సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న హీరో

హైదరాబాద్‌: యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ సెంటిమెంట్‌ ఫాలో అయ్యారు. ఆయన సినీ కెరీర్‌లో హిట్‌గా నిలిచిన సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’. ఈ చిత్రంతో సందీప్‌కు హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రమే కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు బ్రేక్‌ ఇచ్చింది. కాగా ఇప్పుడు సందీప్‌ కొత్త సినిమాకు ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. హాకీ నేపథ్యంలో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ తెలిపింది. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడు. హిప్‌హాప్‌ తమిళ బాణీలు అందించనున్నారు. ఇందులో కథానాయిక ఎవరో తెలియాల్సి ఉంది.

మరోవైపు, సందీప్‌ న్యాయవాది పాత్ర పోషించిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా నవంబరు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హన్సిక కథానాయికగా నటించిన సినిమా ఇది. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకుడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here