తాప్సీ ‘థప్పడ్‌’ మూవీ రివ్యూ

0
11
Taapsee Thappad Movie Review In Telugu - Sakshiటాలీవుడ్‌ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. తొలుత గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన ఆమె… విభిన్న పాత్రలు ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. ఆమె నటించిన పింక్‌, బేబీ, నామ్‌ షబానా, ముల్క్‌, బద్లా, సాంధ్‌ కీ ఆంఖ్‌ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇక సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే తాప్సీ తాజాగా నటించిన చిత్రం థప్పడ్‌(చెంపదెబ్బ అని అర్థం). ముల్క్‌, ఆర్టికల్‌ 15 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుభవ్‌ సిన్హా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒకే ఒక చెంపదెబ్బ ఓ మహిళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది.. ఆమెకు తన అస్థిత్వాన్ని ఎలా గుర్తు చేసింది తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘చెంపదెబ్బ’ అనే చిన్నపాయింట్‌తో తెరకెక్కడం.. భర్త అహం కారణంగా భార్య మనస్సులో చెలరేగిన కల్లోలం.. దాని కారణంగా వివాహ బంధం బీటలు వారిన తీరు తదితర సున్నితమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ముగింపు తీసుకుందనే విషయం తెరపై చూడాల్సిందే.

కథ ఏంటంటే..
అమృత సబర్వాల్‌(తాప్సీ పన్ను) ఓ సాధారణ గృహిణి. భర్త విక్రమ్‌(పావిల్‌ గులాటి)తో కలిసి ఢిల్లీలో నివసిస్తూ ఉంటుంది. డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న తన ఆశయాన్ని పక్కనబెట్టి మరీ భర్త, డయాబెటిక్‌ పేషెంట్‌ అయిన అత్త(తన్వీ అజ్మీ)కి సేవలు చేస్తూ ఉంటుంది. కుటుంబానికి సేవ చేయడం, భర్త ఎదుగుదలలోనే తన సంతోషాన్ని వెదుక్కుంటుంది. అయితే విక్రమ్‌ కూడా భార్యను ప్రేమగానే చూసుకున్నా.. పితృస్వామ్య భావజాలం కారణంగా.. ఓ రకమైన అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. భార్య కంటే కూడా పనిమీదే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ ఉంటాడు. ఇలా వారి జీవితం సాగిపోతున్న సమయంలో విక్రమ్‌.. ఏర్పాటు చేసిన ఓ పార్టీ అమృత ఆలోచనలను మార్చివేస్తుంది. అందరి ముందు భర్త తనను కొట్టిన చెంపదెబ్బకు సమాధానం వెదికే క్రమంలో విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వేధింపులు, సొంత వాళ్ల నుంచి ఎదురయ్యే ఒత్తిడులు.. వీటన్నింటినీ అధిగమించి ఆత్మగౌరవం కోసం తను పోరాడిన తీరు ప్రధానంగా దర్శకుడు కథను అల్లుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here