డిసెంబర్ 5 న కార్తికేయన్ ’90 ML ‘ మూవీ

0
9

Hero Karthikeya Attending 90 ML Movie promotion In Khammam - Sakshi‘90ఎంఎల్‌’ సినిమా ప్రమోషన్‌లో  మాట్లాడుతున్న హీరో కార్తికేయ

 ‘90 ఎంఎల్‌’ సినిమా హీరో, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ బుధవారం ఖమ్మం నగరంలో సందడి చేశాడు. తాను నటించిన ‘90 ఎంఎల్‌’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాన్ని ఖమ్మంలోని సీక్వెల్‌ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తికేయ వేదికపై పాటలు పాడి అలరించాడు. అలాగే తన చిత్రాల్లోని డైలాగ్‌లు చెప్పి విద్యార్థుల్లో జోష్‌ నింపాడు. అమ్మాయిలు నృత్యాలు చేస్తూ, హీరోతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ‘90 ఎంఎల్‌’ సినిమాపై కార్తికేయ ముచ్చటించాడు. ఇది తాను నటించిన 5వ చిత్రమని, తాము నిర్మిస్తున్న రెండో సినిమా అని తెలిపారు.

అలాగే ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తనకు వచ్చిన పేరు మరోసారి ‘90 ఎంఎల్‌’తో వస్తుందన్నాడు హీరో కార్తికేయ. 90 ఎంఎల్‌ సినిమాకి సంబంధించిన మూడు పాటలను ఇప్పటికే విడుదల చేశామని, పాటలు బాగా వచ్చాయని, అనూప్‌ రూబెన్స్‌ మంచి సంగీతాన్ని అందించారని అన్నారు. గురువారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌ 5వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంకు తాను రావడం ఇది మూడోసారని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈవెంట్‌ ఆర్గనైజర్‌ రవికుల నారాయణ ప్రసాద్, శ్రీచైతన్య జూయనియర్‌ కళాశాలల ఏజీఎంలు చిట్టూరి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here