డాటరాఫ్‌ శకుంతల

0
6

డాటరాఫ్‌ శకుంతల

Sanya Malhotra is ready to play Vidya Balan's on-screen daughter - Sakshi

మల్లయోధుడు మహావీర్‌ సింగ్‌ ఫోగట్, ఆయన ఇద్దరు కుమార్తెలు గీతా, బబితాల జీవితాల ఆధారంగా మూడేళ్ల క్రితం వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘దంగల్‌’. మహావీర్‌గా ఆమిర్‌ ఖాన్, బబిత పాత్రను సాన్యా మల్హోత్రా చేశారు. ఇప్పుడు ‘శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌’ సినిమాలో విద్యాబాలన్‌ కుమార్తెగా నటిస్తున్నారు సాన్య. ఇండియాలో హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరు గాంచిన గణితవేత్త, రచయిత శకుంతలాదేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు.

శకుంతలదేవి కూతురు అనుపమా బెనర్జీ పాత్రను సాన్య చేస్తున్నారు. శుక్రవారం సాన్య ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘దంగల్‌’ సినిమాలో నా పాత్ర కోసం జుత్తు కత్తిరించుకున్నాను. ఇప్పుడు అనుపమ పాత్ర కోసం కూడా నా జుత్తును కట్‌ చేసుకోవాల్సి వచ్చింది. పాత్ర కోసం ఇలా మారడం నాకు సంతోషంగానే ఉంది. నిజజీవిత పాత్రలను పోషించేటప్పుడు వారి లుక్‌లోకి మారిపోతే బాగా నటించవచ్చని నా నమ్మకం’’ అన్నారు సాన్య. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here