జీ సినీ అవార్డ్స్‌లో స‌త్తా చాటిన ఇస్మార్ట్ శంక‌ర్

0
22

హీరో రామ్‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ క‌లిసి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్‌తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం విడుద‌లైన అన్ని సెంట‌ర్ల‌లో ప్ర‌భంజ‌నం సృష్టించింది. జూలై 18,2019న ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం విడుద‌ల కాగా, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించింది. రామ్ చెప్పిన డైలాగ్స్‌, ఆయ‌న బాడీ లాంగ్వేజ్‌కి ప్రేక్ష‌కులు ఫుల్ ఫిదా అయ్యారు. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరో స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ చిత్రం జీ సినీ అవార్డ్స్‌లో స‌త్తా చాటింది. పూరీ జ‌గ‌న్నాథ్ బెస్ట్ సెన్సేష‌న‌ల్ డైరెక్టర్‌గా, రామ్ బెస్ట్ సెన్సేష‌న‌ల్ హీరోగా, ఛార్మి బెస్ట్ సెన్సేష‌న‌ల్ ప్రొడ్యూస‌ర్‌గా, బెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీగా ఇస్మార్ట్ శంక‌ర్,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మ‌ణిశ‌ర్మలు ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రానికి అవార్డులు పొందారు. త‌మ చిత్రానికి ఇన్ని అవార్డులు ద‌క్క‌డంపై చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేసింది.

View image on Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here