జలకాలాటల్లో ఏమి హాయిలే అమలా…

0
3
Amala paul Bathtub Photos Viral in Social Media - Sakshi

సినిమా: జలకాలాటల్లో పూలమాటుల్లో ఏమీ హాయిలే అమలా? ఏమిటి నాటి పాట గతి తప్పిందనుకుంటున్నారా? ఇక్కడ ప్రస్తావన ఆ మధురమైన పాట గురించి కాదు. హీరోయిన్‌ అమలాపాల్‌ గురించి. ఈ సంచలన నటి తరచూ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి వార్తల్లోకెక్కింది. అయితే ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు అందుకుందనుకొండి. కానీ ఆ చిత్రం కెరీర్‌ పరంగా చాలా నష్టాన్నే కలిగించింది. అంతకుముందు అమలాపాల్‌తో చిత్రాలను కమిట్‌ అయిన దర్శక నిర్మాతలు వాటిని విరమించుకున్నారు. ప్రస్తుతంలో కొత్త అవకాశాలేమీలేవు. దీంతో అమలాపాల్‌ బాలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలెట్టింది. అలా ఒక చిత్ర అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

తమిళంలో అదో అంద పరవై పోల అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో రూపొందుతున్నదే.  ఏదొక విధంగా వార్తల్లో ఉండాలనుకుందో ఏమో నటి అమలాపాల్‌ తన అర్ధనగ్న ఫొజులతో కూడిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్‌ చేసింది. అదీ బాత్‌రూమ్‌లోని టబ్‌లో రంగురంగుల పూల మధ్య జలకాలాడుతూ తీసిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఇక నెటిజన్ల గురించి చెప్పాలా? ఆలా అమలాపాల్‌ అర్ధనగ్నంగా పూలస్నానమాడుతున్న ఫొటోలను చూసి అమలాపాల్‌ ఆడై 2కి సిద్ధం అవుతుందా అని అడుగుతున్నారు. అయితే ఈ ఫొటో దృశ్యాలపై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయనుకోండి. దర్శకుడు విజయ్‌ మీతో వివాహ బంధాన్ని రద్దు చేయడంలో తప్పేలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే ఆడై చిత్రంలో పూర్తిగా నగ్నంగానే నటించావు. ఇలా ఫొటోలు విడుదల చేయడంలో విశేషం ఏముందిలే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here