జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్

0
15

సీనియర్ హీరోయిన్, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రద చిక్కుల్లో పడ్డారు. ఆమెకు రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థినిగా రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, సమాజ్‌వాదీపార్టీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పోలీస్ కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో రాంపూర్ కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. జయప్రదపై నమోదైన మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20వతేదీన జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here