చిరు సినిమాకు నో చెప్పిన రెజీనా?

0
15

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవితో నటించే అవకాశం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఆయనతో కలిసి తెరను పంచుకునేందుకు చిన్న పాత్రైనా చాలని అంటుంటారు. కానీ చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశాన్ని కథానాయిక రెజీనా వదులుకున్నారట. చిరు-కొరాటల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించబోతున్నారు. రామ్‌ చరణ్, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని అరికట్టే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం.

ఇందులోని ప్రత్యేక గీతం కోసం దర్శక, నిర్మాతలు రెజీనాను సంప్రదించారని రెండు రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ప్రత్యేక గీతంలో నటించడం ఇష్టంలేని ఆమె ఆఫర్‌ను తిరస్కరించినట్లు టాక్‌. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు, విభిన్న కథలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఇలాంటి పాటలో నటించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే రెజీనా స్పందించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here