చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

0
18

తిర్యాణి: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తిర్యాణి ఎంఈవో వెంకటేశ్వర స్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏంఈవో మాట్లాడుతూ విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు రాము, తిర్యాణి, నాయికపు గూడ సర్పంచులు సింధుజ, మధుకర్‌, ఎంపీటీసీ సభ్యురాలు రాజ్యలక్ష్మీ, సింగిల్‌ విండో అధ్యక్షులు శ్రీనివాస్‌, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్‌ సుధాకర్‌ గౌడ్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here