ఘనంగా ఆలయ వార్షికోత్సవం

0
21

అడవిపదిర: మండలంలో అడవిపదిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య నవగ్రహ పూజ, హోమాధికాలు నిర్వహించిన అనంతరం సీతారాముల కల్యాణాన్ని చేపట్టారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. సాయంత్రం గ్రామంలోని పురవీధుల గుండా సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు చేపట్టారు. గొల్లపల్లి గీతామందిరం ప్రధాన అర్చకుడు శ్రీ రవిశర్మ భక్తులకు ప్రవచనాలు చదివి వినిపించారు. అనంతరం శ్రీ మద్భగవద్గీత పారాయణను నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సర్పంచి ఎడ్ల సాగర్‌, గ్రామస్థులు తదితరులు పాట్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here