గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన అమల

0
13

హైదరాబాద్‌: అలనాటి నటి, నాగార్జున సతీమణి అక్కినేని అమల గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భాగస్వాములవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అమల శనివారం తన నివాసంలో మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను ఆమె అభినందించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కొత్త ఏడాదిలో అందరూ మొక్కలు నాటాలని అమల పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here