గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

0
7

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

palasa 1978 teaser launch - Sakshiరఘు కుంచె, నక్షత్ర, పూరి జగన్నాథ్, రక్షిత్‌

– పూరి జగన్నాథ్‌

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందరూ తిడుతున్నారని గ్యాంగ్‌స్టర్‌ సినిమాలు తీయడం లేదు. ‘పలాస 1978’ టీజర్‌ నాకు చాలా చాలా నచ్చింది. హీరో హీరోయిన్లు బాగున్నారు. కరుణ కుమార్‌ పనితనం నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘పూరీగారు మా టీజర్‌ను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్, ఓ సొగసరి పాటతో పాటు టీజర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు కరుణ కుమార్‌. ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం కూడా అందించారు రఘు కుంచె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here