గోపీ చంద్ మళ్ళీ ఆ దర్శకుడితోనే…

0
4

వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న హీరో గోపీచంద్ తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ఇండస్ట్రీకి ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీ చంద్ ఆ సినిమా ఫెయిల్ అవడంతో ఆ తర్వాత వచ్చిన జయం సినిమాలో విలన్ గా నటించి అందరి మెప్పు పొందాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన నిజం సినిమాలో తనదైన విలనిజాన్ని పండించాడు.

అలా విలన్ గా సినిమాలు చేస్తున్న గోపీ చంద్ యజ్ఞం సినిమాతో హీరో అయిపోయాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆ తర్వాత రణం, లక్ష్యం, వంటి సినిమాలతో వరుస విజయాలు పొందాడు. అయితే గత కొన్ని రోజులుగా గోపీ చంద్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆయన నుండి వచ్చిన ప్రతీ సినిమా ఫ్లాప్ గా మారింది. లౌక్యం తర్వాత గోపీచంద్ చేసిన సినిమాలేవీ జనాలకి గుర్తు కూడా లేవంటే ఆ సినిమాల పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

మొన్నటికి మొన్న ఎన్నో అంచనాలతో వచ్చిన “చాణక్య” కూడా బెడిసికొట్టింది. సైరా కి పోటీగా వచ్చిన ఈ సినిమాకి ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో గోపీ చంద్ సరసన తమన్నా కథానాయకిగా నటించనుంది.

అయితే ఈ సినిమా అనంతరం గోపీ చంద్ మరో సారి తేజతో సినిమా చేస్తున్నాడట. తనకి హిట్ ఇచ్చిన దర్శకుడైన తేజతోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. కాగా ఇప్పటికే గోపీచంద్ కి తేజ ఓ లైన్ ను చెప్పారని.. పూర్తిగా పాత్ర బలంతో నడిచే స్క్రిప్ట్ ను గోపీచంద్ కోసం రాస్తున్నారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే యేడాది వీరి ప్రాజెక్ట్ పట్టాలైక్కే అవకాశముంది. మరి ఈ సినిమానైనా గోపీ చంద్ కెరీర్ ని మారుస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here