‘కె.జి.ఎఫ్2’ ఓకే. కానీ ‘ప్రభాస్ 20’ రిలీజ్ డేట్ సంగతేంటి?

0
36

Image result for prabhas latest images

దేశం మొత్తం.. ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుంది. నలుగురు తిరిగే ప్రదేశాలకు వెళ్లాలంటేనే జనాలు తెగ టెన్షన్ పడుతున్నారు. చాలా వరకూ ఐటీ ఆఫీసులు తమ ఎంప్లాయిస్ కు ‘వర్క్ ఫ్రొం హోమ్’ ఫెసిలిటీస్ ను అందించాయి. కేరళ, నెల్లూరు, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో మల్టీప్లెక్స్ లను మరియు షాపింగ్ మాల్స్ ను కొద్ది రోజుల పాటు మూసి వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక టాలీవుడ్ ను కూడా ఈ భయం వెంటాడుతుంది. ఇప్పటికే మార్చి 25న విడుదల చెయ్యాల్సిన ‘వి’ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక షూటింగ్ లు కూడా చాలా వరకూ నిలిపివేస్తున్నట్టు దర్శక నిర్మాతల మధ్యలో డిస్కషన్లు జరుగుతున్నాయి. అందుకే జూలై లో విడుదల చెయ్యాల్సిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ను సైతం అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. అయితే ‘ప్రభాస్ 20’ రిలీజ్ సంగతి ఏంటి? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది…!

ముందునుండీ ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చెయ్యబోతున్నట్లు డిస్కషన్లు జరిగాయి. కానీ ఇప్పుడు కె.జి.ఎఫ్ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు అంటే.. ఆ సమయంలో ప్రభాస్ సినిమా విడుదల లేనట్టే అనే డిస్కషన్లు జరుగుతున్నాయి. అసలే ‘ప్రభాస్ 20’ దర్శకుడు రాధా కృష్ణ కుమార్.. షూటింగ్ ను చాలా వరకూ విదేశాల్లో ప్లాన్ చేసాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ షూటింగ్ జరిపే అవకాశాలు తక్కువయ్యాయి. ఒకవేళ దర్శక నిర్మాతలు పట్టుబట్టి చేస్తాము.. అని చెప్పినా మిగిలిన టెక్నిషియన్లు వస్తారన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఈ ఏడాది ప్రభాస్ సినిమా ఉండకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here