కృష్ణుడుకి పితృ వియోగం

0
4
Actor Krishnudu Father Passed Away Bhimavaram - Sakshi

 పశ్చిమగోదావరి: సినీ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కృష్ణుడు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి అల్లూరి సీతారామరాజు సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా భీమవరం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సీతారామరాజు ఈరోజు మరణించారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు, పార్టీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు వినాయకుడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ అలరించిన కృష్ణుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here