కరోనా మా ప్లాన్ చెడగొట్టింది అంటున్న అడవి శేష్

0
33

Image result for adivi sesh latest images

యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్ ‘ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఎం జి ఎంటర్టైన్మెంట్స్ . ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ద్విభాషా చిత్రంగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితమాధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు ఉన్ని కృష్ణన్ జయంతి కాగా, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేజర్ చిత్రంనుంచి ఓ అప్డేట్ ను ఇద్దామనుకున్నారు కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల దాన్ని వాయిదా వేశారు. ఈ విషయాన్నీ అడివి శేష్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.కరోనా మా ప్లాన్ చెడగొట్టిందంటూ శేష్ రాసుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here