కమనీయం… భద్రకాళీ కల్యాణం

0
5

కవాడిగూడః ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో భాగంగా రెండోరోజు సోమవారం భద్రకాళి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉడిపి పెజూవర్ పీఠాధిపతి విశ్వేశ తీర్ధ స్వామి మాట్లాడుతూ సృష్టికర్త అయిన ఈశ్వరుడు కంటికి కనిపించని విద్యుత్తు శక్తి లాంటి వాడని అన్నారు. భార్యాబిడ్డలను ప్రేమించిన దానికంటే ఎక్కువగా భగవంతుడిని ప్రేమించాలని సూచించారు. భక్తులు ఉన్న చోటే భగవంతుడు ఉంటాడని అన్నారు. సుఖబోధానంద స్వామి మాట్లాడుతూ ఒక్కసారి గుడికి చేరిన రాయి దైవంగా మారితే, పదే పదే గుడికి వెళ్లే మనిషి మాత్రం ఎందుకు రాయిగా మారుతున్నారని ప్రశ్నించారు. జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ మాట్లాడుతూ విషజ్వరాల నుంచి ప్రజలను రక్షించేందుకు దోమల సంహారానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలని సూచించారు. మైల వరపు శ్రీనివాసరావు ప్రపంచం చెప్పారు. భక్తిటీవీ అధినేత నరేంద్ర చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here