కన్నులపండువగా స్వామివారి కల్యాణోత్సవం

0
30

కాలనీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ 34వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్పవం కన్నులపండువగా జరిగింది. ఉదయం సహస్ర నామార్చన, ధ్వజారోహణం, రాత్రి స్వామివారి కల్యాణాన్ని అర్చకులు గోవర్థనగిరి జగన్నాథాచార్యులు, మధుసూధనాఛార్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి, అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల మూలవిరాట్‌లకు విభిన్న రకాల పుష్పాలతో అలంకరించారు. ఆర్జీ-2 జీఎం దంపతులు సురేశ్‌ఆశ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలో అధికారులు, కార్మికులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here