‘కనులు కనులను దోచాయంటే’ మూవీ రివ్యూ

0
18
Dulquer Salmaans Kanulu Kanulanu Dochayante Movie Review And Rating - Sakshi

కథ: 
ఆరేళ్లుగా సిద్ధార్థ్‌ (దుల్కర్‌ సల్మాన్‌), కల్లీస్‌ (రక్షణ్‌) మంచి స్నేహితులు. సిద్ధార్థ్‌ యాప్‌ డెవలపర్‌గా, కల్లీస్‌ యానిమేటర్‌గా పనిచేస్తూ రిచ్‌ లైఫ్‌ను అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరూ మీరా (రీతు వర్మ), శ్రేయా (నిరంజని)లతో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. వారి వెంటపడి వారి ప్రేమను పొందుతారు. అయితే మరోవైపు నగరంలో ఆన్‌లైన్‌ క్రైంతో పాటు ఖరీదైన కార్లలోని ఖరీదైన వస్తువులను దొంగతనాలకు గురవుతాయి. అయితే ఈ కేసులతో పాటు మరో కీలక కేసును అనఫిషియల్‌గా డీల్‌ చేస్తుంటాడు పోలీస్‌ కమిషనర్‌ ప్రతాప్‌ సింహా (గౌతమ్‌ మీనన్‌). మరోవైపు లవ్‌, పెళ్లి, ఎంజాయ్‌ అని సిద్దార్థ్‌, కల్లీస్‌, మీరా, శ్రేయాలు గోవాకు వెళతారు. అయితే అక్కడ మీరా గురించి సిద్ధార్థ్‌కు షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. ఇంతకి ఆ షాకింగ్‌ న్యూస్‌ ఏంటి? ప్రతాప్‌ వెతుకుతున్న ఆ మోసగాళ్లు ఎవరు? సిద్ధార్థ్‌, మీరాల ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? తెలసుకోవాలంటే ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here