ఐదు నెలల్లో….

0
33
Varun Tej New Movie Release On July - Sakshi

జస్ట్‌ ఐదు నెలల్లో తెలిసిపోతుంది వరుణ్‌ తేజ్‌ ఎలా బాక్సింగ్‌ చేస్తారో. ట్రైనింగ్‌ తీసుకుని మరీ బరిలోకి దిగారు. ప్రస్తుతం కెమెరా ముందు బాక్సర్‌గా రెచ్చిపోతున్నారు. తెరపై మనం చూడబోయేది జూలైలో. వరుణ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అసలు సిసలైన బాక్సర్‌లా కనిపించడానికి వరుణ్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం వర్కవుట్‌ చేశారు. అలాగే అమెరికన్‌ బాక్సింగ్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ టోనీ జెఫ్రిన్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 24న వైజాగ్‌లో మొదలైంది. 25 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరగనుంది. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్‌ (బాలీవుడ్‌ నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌ కుమార్తె) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here