ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తా:శర్వానంద్

0
17

ఊహించని రీతిలో ‘జాను’ ఫ్లాప్ అయింది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిలాయి. దీంతో కొంత డిస్టర్బ్ అయ్యారట శర్వానంద్. కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. అయితే హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో ఈ హీరో ఇప్పుడు కాస్త డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో శర్వా కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే మొహమాటానికి పోకూడదని శర్వా బలంగా నిర్ణయించుకున్నారట. ముఖ్యంగా తనకు సన్నిహితులైన దర్శకులు, నిర్మాతల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని ఆయన అనుకుంటున్నారట. ఇకపై కథ నచ్చితేనే సినిమాల్లో నటించాలని.. నచ్చకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా చేయలేనని చెప్పాలని శర్వా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా కొత్త దర్శకుడు కిశోర్ దర్శకత్వంలో శ్రీకారం అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు శర్వా. వ్యవసాయం ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు ఈ యంగ్ హీరో. ఇందులో శర్వా సరసన సాయి పల్లవి రెండోసారి రొమాన్స్ చేయబోతోంది. అలాగే తెలుగు, తమిళ్‌లో తెరకెక్కనున్న ఓ బైలింగ్వల్ మూవీకి కూడా శర్వా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here