ఎట్టకేలకు ఒడ్డెక్కిన “హిట్”

0
26
Image result for hit movie images

వాపు-బలుపు మధ్య చాలా తేడా ఉంది. మొదటి రోజు టాక్ ను గుడ్డిగా నమ్మితే అది వాపు అవుతుంది తప్ప బలుపు అవ్వదు. హిట్ సినిమా విషయంలో ఇదే జరిగింది. రిలీజైన మొదటి రోజు హోరెత్తించారు. చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్ అన్నారు. పైరసీ అవ్వకుండా ఉన్నట్టయితే, చిన్న సినిమాల్లో ఇదే బాహుబలి అని స్వయంగా నాని ప్రకటించుకున్నాడు. కట్ చేస్తే, అతి కష్టమ్మీద హిట్ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.

గురువారంతో మొదటి వారం పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ సినిమా చేసిన ప్రీ-రిలీజ్ బిజినెస్ తో దాదాపు ఇది సమానం. అలా ఈ సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకోవడానికి వారం పట్టింది.

నిజానికి విడుదలైన 3 రోజులకే ఈ సినిమా లాభాల బాట పట్టేస్తుందని అంతా ఊదరగొట్టారు. కట్ చేస్తే, నాలుగో రోజు నంచి బి, సి సెంటర్లలో సినిమా చతికిలపడింది. అలా మల్టీప్లెక్సులకే పరిమితమైన ఈ సినిమా ఎట్టకేలకు బ్రేక్-ఈవెన్ అయింది. వచ్చి వారం అయింది కాబట్టి ఇక లాభాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here