ఉత్తమ క్రీడాకారిణి అవార్డు

0
21

జగిత్యాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని కొత్తపేటకు చెందిన దివ్యాంగ మహిళ గుండేటి సరిత ఉత్తమ క్రీడాకారిణి పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిపై సౌందర్రాజన్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. సరిత మురుగుజ్జు విభాగంలో వివిధ క్రీడల్లో పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై జరిగిన క్రీడల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. ఈ మేరకు ఆమె ఉత్తమ క్రీడీకారిణి పురస్కరం దక్కించుకుంది. ఈ సందర్భంగా తాను గవర్నర్‌తో స్వీయ చిత్రం తీసుకుంది. ఇలాంటి అరుదైన అవకాశం రావడం ఆనందంగా ఉందని సరిత తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here