ఈ కాజల్ గ్లామర్ కు ఏమైంది?

0
18
ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పదిహేనేళ్లు అయినా ఇప్పటికీ సినిమాల్లో ఆఫర్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సీనియర్ భామ కాజల్ అగర్వాల్. అంతే కాకుండా గ్లామరస్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఈతరం భామలకు గట్టి పోటీనిస్తోంది. అయితే ఇవంతా బాగానే ఉన్నాయి కానీ ఈమధ్య కాజల్ బయట కనిపించినపప్పుడు మాత్రం కాజల్ లుక్స్ తేడాగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.కాజల్ కార్పోరేట్ కంపెనీల యాడ్స్ లో కనిపిస్తుంది. షోరూమ్ ఒపెనింగులకు కూడా హాజరవుతుంది. అదే కోవలో ఈమధ్య ఒక వంటనూనె బ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి కాజల్ హాజరైంది. ఈ కార్యక్రమానికి లైట్ బ్లూ కలర్ చీర పింక్ బ్లౌజ్ ధరించి గ్లామరస్ గా కనిపించే ప్రయత్నం చేసింది కానీ కాజల్ లో మునుపటి గ్లామర్ మిస్ అయిందని కొందరు కామెంట్ చేశారు. కొంచెం వెయిట్ పెరిగినట్టుగా కనిపించడమే కాకుండా ఫేస్ లో కూడా ఆ తేడా కనిపిస్తోందని అన్నారు.

వయసు పెరుగుతోంది కాబట్టి వయసుతో పాటు వస్తున్న మార్పులని కొందరు అంటున్నారు. స్టార్ హీరోల ప్రాజెక్టులు చేతిలో లేకపోవడంతో ఇక తన కెరీర్ చివరి దశకు వచ్చినట్టేనని దిగులు పడుతోందని.. కెరీర్ విషయం లో ఆందోళన తన గ్లామర్ పై ప్రభావం చూపిస్తోందని మరి కొందరు అంటున్నారు. ప్రస్తుతం కాజల్ చేతిలో ‘భారతీయుడు 2’.. మరో హిందీ సినిమా ఆఫర్లు ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే సరే కానీ లేక పోతే కాజల్ కెరీర్ చివరి దశకు చేరినట్టే. మరి ఈ పరిస్థితి నుంచి కాజల్ ఎలా బయటకు వస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here