ఇదే చివరిది..ఇక వాటి జోలికెళ్ళను..

0
3

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తెరకెక్కించడానికి నిర్మాతలు, దర్శకులు రెడీ అయిపోతుంటారు. ఆ భాషలో సినిమా హిట్ అయింది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తే మన దగ్గర కూడా హిట్ చేసుకోవచ్చనే భావంతో రీమేక్ హక్కులని కొంటుంటారు. రీమేక్ తీయడం విజయానికి సులువైన దారి అనుకుంటారు. కానీ రీమేక్ చేయడమే చాలా కష్టం. ఒక బాషలో హిట్ అయిన దాన్ని మళ్ళీ అదే ఎమోషన్ తో సినిమా తీయడం కష్టం.

కానీ హిట్ అయిన కథ కాబట్టి వర్కవుట్ అవుతుందన్న నమ్మకంతో రీమేక్ లు చేసేస్తుంటారు. కానీ అన్ని రీమేక్ లు హిట్ అవ్వవు. అదీ గాక ఇప్పుడు తెలుగులో రీమేక్ సినిమాలు ఆశించినంతగా విజయం సాధించట్లేదు. దానికి కారణం తెలుగులోనే మంచి సినిమాలు రావడం కావచ్చు. చాలా సినిమాలు తెలుగు నుండే పరభాషలకి రీమేక్ కి వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు యువ హీరో నిఖిల్ రీమేక్ లు చేయనని అంటున్నాడు.

నిఖిల్ చేసిన అర్జున్ సురవరం తమిళంలో విజయం సాధించిన “కణిధన్” కి రీమేక్. ఇటీవల విడుదల అయిన అర్జున్ సురవరం సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినా సినిమాకి వసూళ్ళు మాత్రం బాగానే ఉన్నాయి. అయితే తాజాగా నిఖిల్ మాట్లాడుతూ, అనుకోకుండా రెండు రీమేక్ లు చేయాల్సి వచ్చింది. స్వతాహాగా నాకు రీమేక్ లంటే అసలు ఇష్టం ఉండదు. ఇక నుండి రీమేక్ ల జోలికి అస్సలు వెళ్ళను అని చెప్పాడు.

నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ , అర్జున్ సురవరం రెండు సినిమాలు రీమేక్ చిత్రాలే. ఇవి ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిఖిల్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అనుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2 చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా విజయం అందుకుంటాడా లేదా చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here