ఆ వీడియోలు చూసి బాగా నవ్వుకునేవాడిని : యాంకర్‌ ప్రదీప్‌

0
1
Anchor Pradeep Machiraju Reacts On His Health Condition - Sakshi

గత కొంతకాలంగా యాంకర్‌ ప్రదీప్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. అంతేకాక బుల్లితెరకు దూరమైపోయాడంటూ ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటిపై ప్రదీప్‌ మాచిరాజు క్లారిటీ ఇచ్చేశాడు. మెదటిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో చేసిన ఆయన తన అనారోగ్యంపై వచ్చిన వార్తలను ఖండించారు. ‘షూటింగ్‌లో నా కాలికి ఫ్రాక్చర్‌ అయింది. డాక్టర్లు నిల్చోవద్దని చెప్పారు. అందుకే రెస్ట్‌ తీసుకున్నా. మళ్లీ ఓ వారంలో షూటింగ్‌లో పాల్గొంటాను’అని ప్రదీప్‌ తెలిపాడు. తన 10 సంవత్సరాల కెరీర్‌లో ఇప్పటివరకూ ఇంతపెద్ద బ్రేక్‌ ఎప్పుడూ తీసుకోలేదన్నాడు. నెల రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలిపాడు.

చాలా రోజుల తర్వాత దీపావళి, తన పుట్టిన రోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేశానని ప్రదీప్‌ సంతోషం వ్యక్తం చేశాడు. బర్త్‌డే విషెస్‌ చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘నెలరోజులు రెస్ట్‌ అంటే బోర్‌ కొడుతుందనుకున్నా కానీ యూట్యూబ్‌ వీడియోలు, వాటి శీర్షికలు చూసి చాలా టైమ్‌పాస్‌ అయింది. క్షీణించిన ఆరోగ్యం, దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ అంటూ క్రేజీ శీర్షికలు ఉన్న వీడియోలను చూసి బాగా నవ్వుకునేవాడిని. కానీ తెలీనివాళ్లు కంగారుపడిపోతారు కదా. సో కాస్త నిజానిజాలు తెలుసుకొని చెప్పండి’ అని హితవు పలికాడు. ‘ఢీ’ షోలో త్వరలోనే మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుకు రాబోతున్నట్టు ప్రదీప్‌ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here