ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ప్రభాస్ 21వ సినిమా…!

0
22

బాహుబలి సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు .బాహుబలి సినిమా తర్వాత ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో సాహో చిత్రం లో నటించిన ప్రభాస్ .తన 17, 18 సినిమాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ తరువాత 19వ సినిమాగా ‘సాహో’ చేశాడు. 20వ సినిమా ఇప్పుడు సెట్స్ పై ఉండగానే, 21వ చిత్రాన్ని ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేయనున్నానని ప్రకటించేశాడు కూడా. వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ సినిమాకు నిర్మాతకాగా, డిసెంబర్ లో షూటింగ్ ను ప్రారంభించి, 2021 చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, చిత్ర కాన్సెప్ట్ పై ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ లో జరుగుతుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫ్యూచరిస్టిక్ జోనర్ లో ఉంటుందట. మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే పరిస్థితి ఏంటన్న కోణంలో స్టోరీ ఉంటుందని పలువురు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here