ఆవగింజంత అదృష్టం.. దబ్బకాయంత దురదృష్టం

0
3
Bheeshma teaser release - Sakshiనితిన్‌, రష్మికా మందన్నా

నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఆదివారం విడుదలైంది. ‘మీ తర్వాత మీ ఆస్తిని, ఇంత పెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుగుణంగా చూసుకునేది ఎవరు? సార్‌’ అనే డైలాగ్‌తో టీజర్‌ విడుదలైంది.

‘నాకు క్వాలిఫికేషన్స్‌ కన్నా… క్వాలిటీస్‌ ఆర్‌ మోర్‌ ఇంపార్టెంట్‌’, ‘స్పీడ్‌గా వెళ్లే స్కూటర్‌కు మేక్‌ గుచ్చుకున్నట్లు నువ్వు నాకుగుచ్చుకున్నావేంట్రా’, ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయంత ఉందండి’.. వంటి టీజర్‌లోని డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ‘‘వినోదం ప్రధానంగా సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌ మూవీ ఇది. ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం’’ అన్నారు వెంకీ కుడుముల. నరేష్, సంపత్, రఘుబాబు, ‘వెన్నెల’ కిషోర్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here