ఆర్ ఆర్ ఆర్ పై వచ్చే వార్తల్లో నిజమెంత…?

0
2

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘RRR’. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేస్తున్న మహా యాగం ఇది. బాహుబలి లాంటి చిత్రం తర్వాత రాజమౌళి మొదలు పెట్టిన సినిమా కావడం అందులోను ఇద్దరు స్టార్ హీరోలతో కలిపి ఇలాంటి భారీ ఫిక్షనల్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీనితో ఈ సినిమాపై ఇప్పుడు ఏ చిన్న వార్త బయటకు వచ్చినా బాగా వైరల్ అయ్యిపోతుంది.

అలాగే ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయ్యిపోయిందని అలాగే చరణ్ సాంగ్ బీట్ కూడా పూర్తయ్యింది అని అలాగే ఎన్టీఆర్ మరియు రామ్‌చరణ్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని వార్తలొస్తున్నాయి. అప్పుడే 80 శాతం షూటింగ్ అయ్యిపోయింది అంటే అది నిజంగానే నమ్మశక్యంగా లేదని చెప్పాలి. అందులోను రామ్ చరణ్ సాంగ్ అంటే అసలు నమ్మబుద్ది కావట్లేదు. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో రాజమౌళి షూటింగ్ కోసం ఇలాంటి వార్తలన్నిటికి చెక్ పెడుతూ ఏదన్నా అప్‌డేట్ ఇస్తే బావుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. .సినిమాపైన అంచనాలు పెంచేందుకు ఒక్కో పాత్రను మెల్లిమెల్లిగా బయటకు వదులుతూ సినిమాపై అటేన్షన్ ని పెంచేసాడు రాజమౌళి. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీయబోయే సినిమాకి కూడా జక్కన్న ఇదే రూల్ ఫాలో అవుతునట్టు తెలుస్తుంది. బాహుబలి 2 విడుదలైన తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయనున్నాడనే ఆసక్తి నెలకొంది. అప్పుడు నవంబర్ 18 2017 న ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి సోఫోలో కూర్చొని ఉన్న ఫోటోను బయటకు వదిలి పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే ఇది పక్కా ప్లాన్ తోనే జాగ్రత్తగా సినిమా పై హైప్ కోసం రాజమౌళి ఫాలో అయ్యే చిట్కా అని కొందరు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here