‘ఆర్ఆర్ఆర్’ పూణే షెడ్యూల్ డిటేల్స్

0
23

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథనాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో తర్వాతి షెడ్యూల్ కోసం పూణేకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. గతంలో పూణే షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌, చరణ్ గాయాలపాలు కావడంతో జక్కన్న వాయిదా వేశారు. ప్రస్తుతం పూణే షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు అక్కడి ప్రభుత్వం పర్మీషన్ కూడా తీసుకున్నారట.

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. కొమరంభీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తొంది. అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here