‘అసలు ఏం జరిగిందంటే’కి యు/ఎ సర్టిఫికెట్

0
20

తక్కువ బడ్జెట్ తో చేసే క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఎక్కువ సినిమాలు రీసెంట్ గా వస్తున్నాయి. సినిమాలు కంటెంట్ బాగుంటే చాలు వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అందుకే ఆ తరహా కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా రూపొందిన చిత్రమే ‘అసలు ఏం జరిగిందంటే’. అనిల్ బొద్దిరెడ్డి నిర్మాణంలో .. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, మహేంద్రన్ .. శ్రీ పల్లవి .. కారుణ్య .. కరోన్య ప్రధానమైన పాత్రలను పోషించారు. ఫస్టు కాపీ వచ్చిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ .. “జీవితం మలుపు తిరగడానికి ఒక్క క్షణం చాలు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసిన మహేంద్రన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here