అల్లరి నరేష్ సరసన కాజల్.. ఆ మూవీ రిమేకేనా?

0
23

గత కొంత కాలంగా వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు అల్లరి నరేష్. సుడిగాడు సినిమా తర్వాత ఈ కామెడీ హీరోకి ఒక్క హిట్టు కూడా పడలేదు. ఇక లాభం లేదని మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ అలా కూడా సక్సెస్ కాలేకపోయాడు. అయితే ఇప్పుడు ఓ విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. స్టార్ డైరెక్టర్ ఈవీవీ తనయుడు అయిన అల్లరి నరేష్ కెరీర్ బిగినింగ్ లో మంచి విజయాలు అందుకున్నా ఇప్పుడు మాత్రం సరైన హిట్స్ అందుకోలేపోతున్నారు. అంతే కాదు ఈ మద్య కాలంలో వస్తున్న కామెడీ సినిమాలు సైతం సరైన కథ, కథనాలతో రాకపోవడం.. వల్గర్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండటంతో కామెడీ సినిమాల ప్రాధాన్యత తగ్గిపోతుందని అంటున్నారు.

అంతే కాదు ఇప్పుడు టిక్ టాక్, కామెడీ వీడియోలు బాగా పెరిగిపోయాయి. కొంత కాలంగా డిజాస్టర్స్ ఎదుర్కొంటున్న అల్లరి నరేష్ ప్రస్తుతం బంగారు బుల్లోడు,నాంది సినిమాలు చేస్తున్నాడు. బంగారు బుల్లోడు గత ఏడాది మొదలైంది.. కానీ నత్తనడకన సాగుతుంది. తాజాగా ఓ మంచి మూవీ ఆఫర్ అల్లరి నరేష్ క వచ్చింది. అదీ కాజల్ సరసన కనిపించటానికి అని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ గా ముందుకు వచ్చారు. ఓ కొరియన్ మూవీ రిమేక్ గా రాబోతుందని అంటున్నారు. కాకపోతే కాజల్ ఇంకా ఆలోచనలో ఉందని చెప్తున్నారు.

నరేష్ ప్రక్కన చేస్తే తర్వాత తన కెరీర్ పరిస్దితి ఏమిటి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ సురేష్ ప్రొడక్షన్ కాబట్టి ఒప్పుకునే పరస్థితి ఉందని అంటున్నారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. చిత్రంలో నరేష్ ఓ లాయిర్ గా నటించబోతున్నాడట. ఓ మెట్రోట్రైన్ లో వ్యక్తిని ప్రమాదం నుంచి కాపాడి రాత్రి రాత్రే మిడీయాలో టాప్ స్టార్ గా మారిపోతాడు. ఆ పాపులారిటీ చివరికి మేయర్ స్థానం వచ్చేలా చేస్తుంది. ఇక ఆ లాయర్ భార్య పాప్ సింగర్ కావాలని ప్రయత్నాలు చేస్తుంది.. అయితే ఆమెకు పాపులారిటీ వస్తే తన రాజకీయ కెరీర్ ఇబ్బంది వస్తుందని భావిస్తాడు. ఇలా వీరి మద్య జరిగే ఘర్షన చిత్రంలో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here