అమ్మవారిపాత్రలో నయనతార

0
42

చెన్నై: అగ్ర కథానాయిక నయనతార అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఇప్పటికే ‘రామరాజ్యం’ సినిమా కోసం సీతగా నటించి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాలో నయన్‌ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో నయన్‌ అమ్మవారి రూపంలో కనిపించి, ఆకట్టుకున్నారు. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘దర్బార్‌’ తర్వాత నయన్‌ ‘నెట్రికన్‌’, ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు మరో తమిళ సినిమాలోనూ కనిపించనున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలోనూ నయన్‌ నటించబోతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here