అమెరికాలో మాత్రమే రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా….కారణం ఏంటి..?

0
3

తెలుగు సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అందునా అమెరికాలో మరీ ఎక్కువగా ఉంది. అమెరికా వాసుల కోసం ఒకరోజు ముందే సినిమాలు విడుదల అవుతుంటాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన సినిమాలకి అక్కడ ఉన్న క్రేజ్ ఏంటనేది. అయితే తెలుగులో విడుదలయ్యే ప్రతీ సినిమాకీ క్రేజ్ ఉంటుందని చెప్పలేం. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకే ఇలాంటి క్రేజ్ వస్తుంటుంది.

చిన్న సినిమాలకి క్రేజ్ ఏర్పడాలంటే చాలా కష్టం. అందువల్ల అన్ని సినిమాలు అమెరికాలో విడుదల అవ్వవు. చిన్న సినిమాలు మరీ కష్టం. కానీ ప్రస్తుతం దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఒక తెలుగు సినిమా కేవలం అమెరికాలో మాత్రమే విడుదల అవుతుందట. ఆ చిన్న సినిమా పేరు మధనం. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో బాలనటుడిగా మెప్పించి.. ఆ తర్వాత ‘మిణుగురులు’ సహా మరికొన్ని చిత్రాల్లో మెరిసిన శ్రీనివాస్ సాయి హీరోగా నటించిన ఈ చిత్రంతో భావన కథానాయికగా పరిచయం అవుతోంది.

అజయ్ సాయి మణికందన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. జనాల్లో ఈ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ ని చూస్తుంతే ఇదో క్లాస్ లవ్ స్టోరీ అనీ, చాలా ఇంటెన్సివ్ గా ఉండబోతుందని అర్థం అవుతుంది. క్లాస్ గా ఉండే సినిమాలు యుఎస్ లో ఉండే వారికి చాలా నచ్చుతాయి. అందుకే చాలా సినిమాలు ఇక్కడ డబ్బులు సంపాదించకపోయిన ఓవర్సీస్ లో డబ్బులు కొల్లగొడుతుంటాయి.

అయితే ఈ సినిమా కేవలం అమెరికాలో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఒక చిన్న సినిమా కేవలం అమెరికాలో మాత్రమే విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణాలేంటనేది స్పష్టంగా తెలియదు. ట్రైలర్ ని చూస్తే తక్కువ బడ్జెట్ లో తీసిన చిత్రమని అర్థం అవుతుంది. వారి బడ్జెట్ కి అమెరికాలో రిలీజ్ చేస్తే చాలనుకున్నారా..మరేంటనేది మాత్రం తెలియదు. లేదా అక్కడ రిలీజ్ చేసి టాక్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇక్కడ రిలీజ్ చేస్తారా అనేది తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here