అన్నాతే షూటింగ్ వాయిదా.. రజనీకాంత్‌ను వెంటాడిన కరోనా వైరస్!

0
19

కరోనా వైరస్ దెబ్బకు దక్షిణాది సినీ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ కష్టాలు సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తప్పలేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అన్నాతేకి కరోనా ఎఫెక్ట్ తగిలింది. సిరుతాయ్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో సుదీర్ఘంగా షెడ్యూల్ సాగింది. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ఉత్తర భారతంతోపాుట పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ విజృంభించడంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు.

ఉత్తర భారతంలో సుమారు 31 మందికి పైగా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. దాంతో అన్నాతే సినిమా షూటింగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నాం. ప్రస్తుతం చెన్నైలోనే సినిమా షూటింగ్ చేయాలని అనుకొంటున్నాం. ఈ మేరకు భారీ సెట్‌ను వేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న అన్నాతే చిత్రంలో టాలీవుడ్ నటుడు గోపిచంద్‌ విలన్‌గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ జరుగలేదు. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.

రజనీకాంత్‌తోపాటు నయనతార, మీనా, కుష్భూ, కీర్తీ సురేష్, ప్రకాశ్రాజ్, సూరీ తదితరులు కీలక పాత్రలో నటిస్తారు. వీరమ్, విశ్వాసం మాదిరిగానే గ్రామీణ వాతావరణంలో సాగే వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకొంటుందని తెలుస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here